బుదవారం పరకాల మండలం మల్లక్కపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల& కళాశాలను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. డైనింగ్ హాల్ మరియు వంటగది మరియు స్టోర్ రూమ్, ఆర్వో మినరల్ ప్లాంట్ ను పరిశీలించారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలించారు తరగతి గదులు సందర్శించి విద్యార్డినులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
👉హాస్టల్ లో జనరేటర్ లేక కరెంటు పోయినప్పుడల్ల ఇబ్బంది పడుతున్నామని,భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని వర్షం పడితే బురదమయ అవుతుందని తరచూ పాములు వస్తున్నాయని మినరల్ వాటర్ ప్లాంట్ సరిగా పనిచేయడం లేదని విద్యార్థినిలు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు.
👉పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలని, విద్యార్థులకు అందిస్తున్న అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
👉గురుకుల పాఠశాలలో ఉండే విద్యార్డినులు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు కనుక ఉపాధ్యాయులు,ఉద్యోగులు విద్యార్థులకు అసహ్యించుకోకుండా ప్రేమతో విద్యాబుద్ధులు నేర్పాలని హాస్టల్ నిర్వాహకులకు హితబోధ చేశారు.
👉గురుకుల పాఠశాలకు అవసరమాకు మౌలిక సదుపాల ఏర్పాటుకు తాను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అవసరమైన నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు.
👉పిల్లలకి నాణ్యమైన విద్య తో పాటు పౌష్టిక ఆహారం అందించే విషయంలో రాజీ పడవద్దని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.
👉గురుకుల పాఠశాలాల అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారని,పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తెలియజేయాలి అన్నారు.
👉అనంతరం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన పిల్లల ఆహార నియమాల పట్టిక (మెను) అందించాలని అన్నారు.
👉కళాశాల ప్రాంగణం,భోజన ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని,తద్వారా విద్యార్థులను అనారోగ్య బారిన పడకుండా చూసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
👉కూరగాయలు, పండ్లు, ఇతర వంట సామాగ్రి పై నాణ్యత తో కూడిన సరకులను ఉపయోగించాలని,నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు.
👉వర్షాకాలం లో పాఠశాలల ఆవరణలో ఆట స్థలాలు లో గుంతలు లేకుండా చూసుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
👉మ్యానుఫ్యాక్చరింగ్ తేది, నాణ్యత తప్పనిసరిగా చూసుకోవాలని,టెండర్లు ఏ వస్తువులను కోడ్ చేశారో అట్టి వస్తువులు మాత్రమే తీసుకావాలని,నాణ్యత లేని వస్తువులు తీసుకున్నట్లైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.